Friday 15 March 2013

పనస పిక్కల కూర.


పనసతొనలు తినేసాక వాటిలో పిక్కలను పడేయకుండా శుభ్రం చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి 


కుక్కర్లో కొన్ని నీళ్ళుపోసి పిక్కలను వేసి 3 విజిల్స్ వచ్చేవరకూ ఉడకబెట్టి చల్లారాకా పైన తోలు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. 


బాణాలిలో ముందు నూనెవేసి ఉల్లి ముక్కలు వేసి వేపుకోవాలి


తరువాత ఉడకబెట్టి కోసిన పనసపిక్కల ముక్కలు వేసి కలుపుకోవాలి

అవి వేగాకా టమోటా ముక్కలువేయాలి 


తరువాత పసుపు,ఉప్పు ,కారం,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలుపుకోవాలి .కొద్దిగా నీరు పోసి ఉడకనివ్వాలి.



పనసపిక్కల కూర తయార్.ఈ కూర చాలా బాగుంటుంది

3 comments:

Anonymous said...

గింజలు అనలేరూ? పిక్కలు ఏమిటండీ? పిక్కలూ, తొక్కలూ. తెలుగు బాష తగలబడి పోతూంది అంటూంటే వినరేం? :-)

మళ్ళీ అడిగించుకోవడం ఎందుగ్గానీ ముందే థేంక్స్ చెప్పేయండి మరి :-)

చిన్నప్పుడు మా ఇంట్లో తినేవాళ్ళం ఇది. కొండొకచో ఈ గింజలు తక్కువగా ఉంటే వంకాయ కూరలోనో మరో కూరలోనే కలిపేసి కూర చేసేవారు. దరిద్రుడికి ఆకలి ఎక్కువ కదా అంచేత ఏది తింటున్నామో తెల్సేది కాదు.

తులసి said...

కామెంట్స్ రాకపోయినా పర్లేదండి.మా అమ్మే నన్ను తిట్టదు :)
పనస గింజలు అనరు పనస పిక్కలు అంటారు.అవును ఇవి అన్న కాంబినేషన్స్ కు వాడేస్తారు.

Anonymous said...

pikkalu,thokkalu, chekkalu ivvanni kuda telugu padhale... 'telugu baasha thagalabadipothandhi' ani miru anatam em baledhu andi.....