Tuesday 1 December 2015

కలగూర

కలగూర సంక్రాంతి,నోములు వంటి ప్రత్యేక పండుగలలో వండుతారు.కాని ఇది తరుచు వండటం వల్ల పిల్లలకు అన్ని రకాల కూరగాయల పోషకాలు అందుతాయి . అంతేకాక ఒక్కోసారి ఇంట్లో మిగిలిపోయిన ఒకటి రెండు వెజిటెబుల్స్ తో ఈ కూర చేసుకోవచ్చు.


నేను  బంగాళదుంప ,కాలిప్లవర్ ,దొండకాయ,గుమ్మడికాయ,చిక్కుడు,బీట్ రూట్ ,బెండకాయ ,క్యారెట్ ఇలా అనేక రకాల వెజిటెబుల్స్ కొంచెం కొంచం కట్ చెసుకున్నాను. 

నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర,మినప్పప్పు,శనగపప్పు వెల్లుల్లి,ఎండుమిర్చి,కరివేపాకు,ఉల్లిపాయ తో తాలింపు పెట్టుకోవాలి 


తర్వాత వెజిటబుల్స్ అన్ని వేసి బాగా వేపుకుని ఉప్పు,పసుపు వేసి వేగాకా ఇష్టం అయినవారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలపాలి..(అల్లం వెల్లుల్లి ఎప్పుడూ ఫ్రెష్ ఉంటే కూర రుచి ఉంటున్ది.తాజాగా ఉంటే తొందరగా ఫ్రై అవుతున్ది.. నిలవ ఉన్న పేస్ట్ అయితే ఉల్లి ముక్కలప్పుడే ఎక్కువ సేపు వేపుకోవాలి.   కారం,ధనియాలపొడి వేసి కలపాలి. 

రుచికరమైన కలగూర రెడీ 

Tuesday 24 November 2015

ఆహార కొరతలేని భారతదేశం

బొప్పాయి గింజలకు రంగు కలిపి మిరియాలు
,జంతు కళేబరాలతో నెయ్యి,నూనె,డాల్డా,
చీపురు ముక్కలతో జీలకర్ర,
పైంట్ కలిపిన గసగసాలు,
ఇటుకపొడితో మషాలాలు ,
యూరియాతో పాలు,
కెమికల్స్ తో పప్పులు,ఉప్పులు  చేసుకోగల సత్తా ఉండగా వరదలు,కరువు,రైతుల ఆత్మ హత్యలు  భారతీయులను ఏం చెయ్యగలవు?