Monday 11 March 2013

వెన్న తీయడం నెయ్యి కాయడం

 మనం  నెయ్యి కోసం వెన్నను రెండు రకాలుగా తీయవచ్చు.

 మొదటి రకం: పాలను మరగబెట్టి ఆ పై మీగడను ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి.
రెండవది : పాలను మరగబెట్టి పెరుగు తోడుబెట్టి ఆ పై మీగడను తీసుకుని ఒక గిన్నెలో ప్రక్కన బెట్టుకోవాలి.
 రెండవ రకం ముందు చూద్దాం.



ముందు పెరుగు మీగడను ఇలా రోజు గిన్నెలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 




ఈ మీగడను ముందు మిక్సీలో వేసి ఒకసారి  బ్లెండ్ చేయాలి 



తరువాత ఒక గ్లాసుడు నీరుపోసి రెండు మూడుసార్లు బ్లెండ్ చెయ్యాలి.ఇలా వెన్న పైకి తేలిపోతుంది( ఇంకా వెన్న  తేలకపోతే ఇంకొంత నీరుపోసి మళ్ళీ రెండుసార్లు బ్లెండ్ చెయ్యాలి.)




ఇప్పుడు చేతిలో ఈ వెన్నను తీసుకుని నొక్కుతూ నీరుపోయేలా చేసి ముద్దగ్గా చేసుకోవాలి



మరో రెండుసార్లు బ్లెండ్ చేస్తే మిగిలిన వెన్న కూడా పైకి తేలుతుంది.



ఈ వెన్నను నీటిలో వేసి పెరుగువాసన పోవడానికి  చెదరకుండా కడుక్కుని గిన్నెలో వేసుకోవాలి.


మిగిలిన మజ్జిగను మనం త్రాగేయవచ్చు.


ఈ వెన్నను సన్నని మంటపై కాయాలి..ఇలా కాచినప్పుడు కరివేపాకు వేస్తే మంచి వాసన వస్తుంది 


నురుగుపోయి తేనే రంగు వచ్చాకా స్టవ్ ఆపేయాలి



శుభ్రమైన సీసాలో భధ్రపరుచుకోవాలి


పాలగ మీడతో వెన్న చెయ్యాలంటే కాగిన పాలను చల్లారాకా  ప్రిడ్జ్ లో పెట్టి  బయటకు తీసాకా మీగడను ఒక గిన్నెలో తీసుకోవాలి.ఇలా చేస్తే మీగడ తొందరగా మనకు వస్తుంది.ఈ మీగడను పైన చెప్పిన విధంగానే మిక్సీలో వేసి, వెన్న తీసుకోవాలి .ఇది కేకుల పై ఐసింగ్ కి ,వంటల పై క్రీం గా పని చేస్తుంది .నెయ్యి కావాలంటే పాల మీగడను తోడుపెట్టి  ఆరుగంటలు ఉంచి అప్పుడు వెన్న తీయాలి.

4 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

బాగున్నదండీ. మంచి వివరాలిచ్చినారు. మీ నెయ్యి కూడా బాగుంది.

తులసి said...

లక్ష్మీ దేవిగారు ధన్యవాదాలు

జయ said...

బాగుంది మీ నెయ్యి. మీ ప్రొఫైల్ లేదేంటండి.

తులసి said...

టెంప్లెట్ డిజైన్ చేసినప్పుడు పోయింది . ఎట్లా పెట్టాలో తెలియలేదు .ధన్యవాదాలు :)