Wednesday 13 March 2013

గుత్తి దొండకాయ కూర



ముందుగా దొండకాయలు నాలుగు వైపులా సగం సగం కోసి పెట్టుకోవాలి




ఉల్లిపాయలు చిన్న,చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో అల్లంవెల్లుల్లి ముద్ద,కారం,పసుపు,మషాలా పొడి,ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి 




ఆ మిశ్రమం దొండకాయల్లో కూరుకోవాలి 



మూకుడులో నూనెవేసి (కాస్త ఎక్కువే పడుతుంది) ఈ దొండకాయలు జాగ్రత్తగా అందులో వేయాలి.



మంట సింలో పెట్టి,మూతపెట్టి దానిపై నీరు పోయాలి.ఇలా చేస్తే దొండకాయ అడుగుపట్టకుండా త్వరగా ఉడుకుతుంది.



కూర సగం వేగాక మిగిలిన ఉల్లి మిశ్రమం కూడా వేసుకోవాలి

కూర బాగా వేగాక అలాగే దింపుకోవచ్చు లేదా కాస్త చింత పండు పులుసు వేసి దగ్గరకు రాగానే స్టవ్ ఆపేయాలి 


గుత్తి దొండకాయ కూర రెడి

15 comments:

Anonymous said...

వంకాలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి కనక వంకాయని కాయ పళంగా (పడంగా అని కొందరంటారు కూడా) వండితే దాన్ని గుత్తి వంకాయ కూర అంటారు. చిన్న వంకాయల్ని గుత్తి వంకాయ అనడం కూడా ఒక కారణం.

దొండకాయలు అలా కాయవు. వంకాయ కూరని అలా గుత్తొంకాయ కూర అన్నారు కదా అని గుత్తి దొండకాయ అనేయడం ఏమిటి?

కూర నోరు ఊరిస్తూ బానే ఉంది కానీ తెలుగు భాష తగలబడి పోతోంది. గమనించ గలరు. :-) (No offense please!)

తులసి said...

:(.నాకు కూర నేర్పిన ఆంటీగారు ఈ పేరే చెప్పారు

Anonymous said...

ఈ కాయ "పళంగా" "పడంగా" అన్నది ఒక ప్రముఖ బ్లాగర్ అని అందరూ అనుకునే ఒక మహిళా బ్లాగరిణి యొక్క భాష అనుకుంటాను ;)...

అలాగే గుత్తి అంటే వంకాయ గుత్తులుగా కాస్తాయి కాబట్టి అది గుత్తి వంకాయ కూర కాదేమో అని నా అభిప్రాయం...

కూరగాయల్ని ముక్కలుగా కోయకుండా కాయ మొత్తాన్ని వండటమే గుత్తి కూర అనుకుంటాను...

మరి పప్పుగుత్తిని గుత్తి అంటాము కదా అంటే
పప్పు గుత్తులన్నీ గుత్తులుగా ఎక్కడన్నా కాస్తాయంటారా అనానిమస్ తెలుగు భాషా అభిమాని గారూ ;)

రాజ్యలక్ష్మి.N said...

మీ గుత్తి దొండకాయ కూర బాగుందండీ వంట మొత్తం ఫొటోలతో చక్కగా చూపించారు...

శ్యామలీయం said...

కూర చాలా బాగుందండీ తులసిగారూ. అయితే అందరూ అల్లం - వెల్లుల్లి మిశ్రమం వాడరు. నాకు తెలిసినంతవరకూ కోస్తాంధ్రజిల్లాల్లో అల్లంవెల్లుల్లి మిశ్రమం వాడరండి. నేనైతే తెలంగాణా ప్రత్యేకత అనుకుంటున్నాను.

అజ్ఞాతగారూ బెంగ పెట్టుకోకండి తెలుగు భాష తగలబడి పోతోందీ అని. గుత్తి అంటే కాయలగుత్తి మాత్రమేకా నక్కర లేదు. ఒక గుత్తిలాగ తరగబడిన ఒకే కాయ కూడా కావచ్చును మహారాజులాగా.

Anonymous said...

గుత్తి దొండకాయకూర నోరు ఊరిస్తూ ,ఉండటమే కాక పేరు కూడా చాలా బాగుంది.గుత్తి దొండకాయ అన్నంత మాత్రాన తెలుగు భాష కి వచ్చిన నష్టం ఏమీ లేదు :-)

తులసి said...

Anonymous గారు పప్పుగుత్తి ఉదాహరణ బాగుంది.
రాజిగారు పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు
శ్యామలీయంగారు అవును వెల్లుల్లి కొద్దిమంది ఇష్టపడరండి.
చివరి Anonymousగారు ధన్యవాదాలు

Anonymous said...

>> ఈ కాయ "పళంగా" "పడంగా" అన్నది ఒక ప్రముఖ బ్లాగర్ అని అందరూ అనుకునే ఒక మహిళా బ్లాగరిణి యొక్క భాష అనుకుంటాను ;)...

కాదండి. కోస్తాలో అలాగే అంటారు అందరూ. కోస్తా భాష అనుకోండి పోనీ. పడంగా అనేది బ్లాగరిణి గారిదేమో కానీ పళంగా అన్నది మాత్రం ఖచ్చితంగా కోస్తాదే. :) పడిశెం పట్టినప్పుడు 'పళంగా' అనేది 'పడంగా' ఐపోయింది అంతే.

>> అలాగే గుత్తి అంటే వంకాయ గుత్తులుగా కాస్తాయి కాబట్టి అది గుత్తి వంకాయ కూర కాదేమో అని నా అభిప్రాయం...

మీ అభిప్రాయం అలాగే ఉంచుకోండి.

>> కూరగాయల్ని ముక్కలుగా కోయకుండా కాయ మొత్తాన్ని వండటమే గుత్తి కూర అనుకుంటాను...

దీన్నే 'పళంగా' అని చెప్పుకున్నాం కదా?

>> మరి పప్పుగుత్తిని గుత్తి అంటాము కదా అంటే పప్పు గుత్తులన్నీ గుత్తులుగా ఎక్కడన్నా కాస్తాయంటారా అనానిమస్ తెలుగు భాషా అభిమాని గారూ ;)

ఎప్పుడైనా కందులు మినుముల పంట చూసేగా మహానుభావా? అవి ఎలా కాస్తాయో తెల్సా? మొక్క మీద ఒక్కొక్క పప్పు బద్ద కాస్తుందా లేకపోతే గుత్తులుగా కాస్తాయా?

తులసి గారూ
మీ బ్లాగుకి నా కామెంట్ వల్ల ఎంత పేరొచ్చిందో చూసేరా? ముందు థేక్స్ చెప్పుకోండి మరి :-)

తులసి said...

తులసి గారూ
మీ బ్లాగుకి నా కామెంట్ వల్ల ఎంత పేరొచ్చిందో చూసేరా? ముందు థేక్స్ చెప్పుకోండి మరి :-)

:))thank you

జయ said...

బాగుందండి దొండ కాయ కూర. నేను మాత్రం అల్లంవెల్లుల్లి వేయకుండా చేసుకుంటాను. సరేనా:)

తులసి said...

సరేననండి jaya gary:)

Anonymous said...

aaha gutthi dhondakaya kura nooruruthondhi, idhi cheyalani nenu chala try chesanandi.... naku vachinde chikkantha dhondakayalu sariggane vudevi kavu kooremo last stage ki vachesedhi... mamuluga enthasepu vudikinchali andi?

Anonymous said...

aaha gutthi dhondakaya kura nooruruthondhi, idhi cheyalani nenu chala try chesanandi.... naku vachinde chikkantha dhondakayalu sariggane vudevi kavu kooremo last stage ki vachesedhi... mamuluga enthasepu vudikinchali andi?
na peru yamini

Anonymous said...

"అలాగే గుత్తి అంటే వంకాయ గుత్తులుగా కాస్తాయి కాబట్టి అది గుత్తి వంకాయ కూర కాదేమో అని నా అభిప్రాయం...

కూరగాయల్ని ముక్కలుగా కోయకుండా కాయ మొత్తాన్ని వండటమే గుత్తి కూర అనుకుంటాను...

మరి పప్పుగుత్తిని గుత్తి అంటాము కదా అంటే
పప్పు గుత్తులన్నీ గుత్తులుగా ఎక్కడన్నా కాస్తాయంటారా అనానిమస్ తెలుగు భాషా అభిమాని గారూ ;)

13 March 2013 09:11"


yey bale chepparu miru... nijame i agree

Anonymous said...

"ఎప్పుడైనా కందులు మినుముల పంట చూసేగా మహానుభావా? అవి ఎలా కాస్తాయో తెల్సా? మొక్క మీద ఒక్కొక్క పప్పు బద్ద కాస్తుందా లేకపోతే గుత్తులుగా కాస్తాయా?"

pappu gutthi ante pappu yela kasthaya ani kadhu andi swamy moddha pappu,tamota pappu, aaku pappu, beerakaya pappu thintare avi chesetappudu 'pappu gutti' tho paamutharu adhi oka chekka vasthuvu

i am yamini